News October 16, 2025

మంత్రుల వ్యవహారంపై ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్

image

మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య వరుస విభేదాలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఆమె ఆరా తీశారు. సీఎం, మంత్రులపై కొండా సురేఖల కుమార్తె సుష్మిత చేసిన కామెంట్స్‌ ఎందుకు చేశారనే దానిపై ఇన్‌ఛార్జి ఆరా తీశారు.

Similar News

News October 16, 2025

జూబ్లీబైపోల్: 3 రోజుల్లో 35 నామినేషన్లు.. 21 వరకు మరెన్నో?

image

జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు 3రోజుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో 35 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇంకా 21 వరకు టైమ్ ఉంది. అంటే ఈ రోజుతో కలిపి ఆరు రోజులన్నమాట. అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విషయమేంటంటే ప్రధాన పార్టీల్లో BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంతవరకు నామినేషన్ వేయలేదు. ఒక్క BRS తప్ప. ఎంతమంది పోటీకి సిద్ధమవుతారో చూడాలి మరి.

News October 16, 2025

రంజీ DAY-2: పడ్డా.. తిరిగి నిలబడ్డ ఢిల్లీ

image

సొంతగడ్డపై జరుగుతున్న రంజీలో HYD, ఢిల్లీని ఆపలేకపోతోంది. ఓపెనర్ సాంగ్వాన్ 117*, ఆయూష్ దొసేజా 158* సెంచరీలతో అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 256/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ బ్యాటర్లు HYD బైలర్లను ఈజీగా ఎదుర్కొంటున్నారు. 2వ రోజు భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసేలా కనిపిస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత వికట్లు పడగొట్టి HYD నిలువరించగలదేమో చూడాలి. మిలింద్ 2, పున్నయ్ ఒక వికెట్ తీశారు.

News October 16, 2025

మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

image

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షి నటరాజన్‌తో భేటీ కీలకం కానుంది.