News August 17, 2025

మంథనిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

image

మంథని పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి ఉత్సావాల మధ్య శనివారం ఘనంగా జరిగాయి. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, కోదండరామాలయాల్లో వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిగి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. “కృష్ణుడు అవతరించింది చెడును అంతమొందించి ధర్మాన్ని స్థాపించేందుకే” అని భక్తులు పేర్కొన్నారు. చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో పాల్గొని కనువిందు చేయగా, పట్టణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

Similar News

News August 17, 2025

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు

image

గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. APతో పోలిస్తే TGలో దాదాపు 3 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. APలో 367% పెరగ్గా, TGలో 917% పెరిగాయి. TGలో 2020-21లో 1578 అబార్షన్లు జరగ్గా 2024-25లో ఆ సంఖ్య ఏకంగా 16,059కి పెరిగింది. ఇదే సమయంలో APలో 10,676 కేసులు నమోదయ్యాయి. కాగా 25,884 అబార్షన్లతో కేరళ టాప్‌లో ఉంది. ఈ గణాంకాలను కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో సమర్పించారు.

News August 17, 2025

నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం లైవ్ కోడి కేజీ గత వారంతో పోలిస్తే రూ. 8 తగ్గి రూ.121గా విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ. 240 నుంచి రూ. 260, విత్ స్కిన్‌ రూ. 220 నుంచి రూ. 240 మాంసప్రియలకు అందుబాటులో ఉంది. మటన్ ధర కేజీ రూ. 900 వద్ద కొనసాగుతుంది. 100 కోడిగుడ్లు రూ. 520 విక్రయిస్తున్నారు. లైవ్ కోడి ధర తగ్గినప్పటికీ గతవారం ధరలనే చికెన్ స్టాల్స్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు.

News August 17, 2025

NZB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంత మందికి వచ్చిందో తెలుసా?

image

నిజామాబాద్ జిల్లాలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఊతమిచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి కింద 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా, షాదీ ముబారక్ ద్వారా 672 మంది లబ్ధిదారులకు రూ.6.72 కోట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం రూ.17.53 కోట్లు పంపిణీ అయినట్లు పేర్కొన్నారు.