News April 7, 2025
మంథనిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి

మంథని మండలంలో నిన్న వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. మంథని మండలం భట్టుపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గడి రవి(45) అనే వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన దుర్కి కొమురయ్య(45) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News April 9, 2025
సంగారెడ్డి: వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడండి: కలెక్టర్

వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను 100% ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు. 25%కు రాయితీతో ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30 వరకు పెంచినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News April 9, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓అశ్వాపురం ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో✓పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి:CPM✓జూలూరుపాడులో బైక్ ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు✓వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి: మైనారిటీ సెల్ ✓సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే పాయం ✓నాటు తుపాకులతో ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకున్న అశ్వారావుపేట పోలీసులు
News April 9, 2025
మెదక్: ధరణి సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ధరణి సమస్యలను పక్కా ప్రణాళికతో పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ధరణి సమస్యలపై సంబంధిత అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగులో ఉన్న దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు.