News September 18, 2025

మంథని: అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ

image

అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో సీబీఐ అధికారుల బృందం విచారణ మొదలైంది. గురువారం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో వామనరావు ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వారి వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పాల్గొన్నారు. సీబీఐ విచారణ ప్రారంభం కావడంతో మంథని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News September 19, 2025

5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.

News September 19, 2025

కెరమెరిలో చెక్‌పోస్ట్ తనిఖీ

image

కెరమెరి మండలం ఎస్సాపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌ను ఈరోజు ఎఫ్ఆర్ఓ మజహరుద్దీన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన ఆయన చెక్‌పోస్ట్ గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని రికార్డులు నమోదు చేయాలన్నారు. స్మగ్లర్లు వర్షాకాలాన్ని అదునుగా చేసుకొని స్మగ్లింగ్ పెంచే ప్రమాదం ఉందని, సిబ్బంది ప్రత్యేక నిఘాపెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు.అడవి, వన్యప్రాణులను నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News September 19, 2025

GDK: ‘19న జీఎం కార్యాలయాల వద్ద ధర్నాను విజయవంతం చేయండి’

image

2024-2025లో సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి, 35 శాతం వాటా త్వరగా చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం సింగరేణి జీడీకే 11వ గని, జీడీకే 1వ గని, ఏరియా వర్క్‌షాప్‌ల వద్ద గేట్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు. లాభాల వాటా, స్ట్రక్చర్‌ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యూలర్లు జారీ చేయాలని ఈ నెల 19న జిఎం కార్యాలయాల వద్ద ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.