News October 14, 2025
మంథని: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి స్టేజీ సమీపంలో బొక్కల వాగు కట్ట కింద SSB ఇటుకల బట్టి సంపులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిది మంథని మండలం స్వర్ణపెళ్లి గ్రామం. అతడిని ఉప్పు మహేష్‌గా గుర్తించారు. మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. మృతుడు గత ఐదు సంవత్సరాలుగా ట్రాక్టర్ మెకానిక్‌గా మంథనిలో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.
Similar News
News October 14, 2025
నారాయణపేట: ఇందిరమ్మ ఇండ్ల పనులపై కలెక్టర్ సమీక్ష

నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పనుల్లో ఆలస్యం జరుగుతున్నందుకు ఆమె అసహనం వ్యక్తం చేశారు. గ్రేడింగ్ పూర్తయిన ఇండ్లను వెంటనే ప్రారంభించి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అని ఆమె అన్నారు.
News October 14, 2025
తాజా రౌండప్

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం
News October 14, 2025
యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.