News February 7, 2025
మంథని : గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
మంథని పట్టణంలోని గంగపురి ప్రాంతంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 7, 2025
పవన్ సిక్ అయ్యాడా.. అలిగాడా?: అంబటి
AP: Dy.CM పవన్ కళ్యాణ్ నిజంగానే అస్వస్థతకు గురయ్యాడా లేదా షూటింగ్‌లో ఉన్నాడా అని YCP నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌పై పవన్ అలిగాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ ఒక్క హామీని నేరవేర్చలేదు. హామీలు అమలు చేయకుండా జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కూటమి పాలనలో అన్నీ మోసాలు, దాడులు, అరాచకాలే. గ్యారంటీ ఇచ్చిన పవన్ కూడా అడ్రస్ లేడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News February 7, 2025
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత: తిరుపతి SP
సమాజంలో డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉందని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కరకంబాడి రోడ్ ఫ్యాబ్ బిల్డింగ్‌లో మెడికల్ షాప్ యజమానులు, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ హరిప్రసాద్‌తో కలిసి ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ని నిర్మూలించే బాధ్యత అందరిదని గుర్తు చేశారు. భావి తరాలు చెడిపోకుండా అందరూ సహకరించాలని కోరారు.
News February 7, 2025
కోరుట్ల ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్ హెచ్- 63 రోడ్డు కోసం సేకరించిన భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ రికార్డులను పరిశీలించి ఏ గ్రామంలో ఎంత భూమి కోల్పోతున్నారనే విషయాలపై చర్చించారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహశీల్దార్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.