News August 24, 2025

మంథని నుంచి శ్రీశైలంకు ప్రత్యేక బస్సు

image

మంథని బస్టాండ్ నుంచి ఈ నెల 31న శ్రీశైలానికి ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజ్ సర్వీసును ప్రారంభించనున్నట్లు DM శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ బస్సు మంథని బస్టాండ్ నుంచి బయలుదేరి శ్రీశైలం దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో అహోబిలం దర్శనం చేసుకుని మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మంథనికి చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,800 ఛార్జీ. వివరాల కోసం 9959225923, 9948671514 నంబర్లను సంప్రదించవచ్చు.

Similar News

News August 25, 2025

కర్నూలు: DSC-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా

image

రేపటి రోజు జరగాల్సిన DSC-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వెరిఫికేషన్ తేదీనీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతుల మేరకు ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్సీ అభ్యర్థులు కీలక మార్పును గమనించి సహకరించాలని కోరారు.

News August 25, 2025

ధర్మారం: TGRS పూర్వ విద్యార్థికి కవితా పురస్కారం

image

ధర్మారం మండలం నంది మేడారం TGRS&JC పూర్వ విద్యార్థి (SSC 2010-11) చిందం రమేష్ ఆదివారం ఖమ్మంలో ‘వురిమల్ల పద్మజ స్మారక జాతీయ కవితా పురస్కారం’ అందుకున్నారు. ఆయన రాసిన ‘విషాద కావ్యం’ కవితకు గాను జాతీయస్థాయిలో ఈ పురస్కారం లభించింది. కాగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన రమేష్ అదే మండలంలోని రాంనూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

News August 25, 2025

LIC ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:MLA

image

భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య 1964 బ్రాంచ్–2, కరీంనగర్ శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం కరీంనగర్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA గంగుల కమలాకర్ హాజరై ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఏజెంట్ల సమస్యలు, భవిష్యత్తు బీమా విధానాలు, ప్రజల్లో బీమా అవగాహన పెంపొందించడంలో ఏజెంట్లు పోషిస్తున్న కీలకపాత్రపై విశదీకరించారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.