News September 24, 2025
మంథని: ‘ఫీవర్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం మంథనిలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి ఆసుపత్రికి వచ్చే జ్వరం కేసులకు మంచి వైద్యం అందించాలని, సీజనల్ వ్యాధుల లక్షణాలున్న వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. అనంతరం ఆయన జేబీఎస్ స్కూల్, బాలికల జడ్పీహెచ్ఎస్ స్కూల్, గురుకుల పాఠశాలలను సందర్శించి పరిశీలించారు.
Similar News
News September 24, 2025
సీసీ కుంట: అక్టోబర్ 22 నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 22 నుండి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.
News September 24, 2025
రేవులపల్లి-నందిమల్ల వంతెన కోసం ఎంపీకి వినతి

ధరూర్ మండలం రేవులపల్లి-నందిమల్ల మధ్యలో పాత జీవో ప్రకారం వంతెన (HLRB) నిర్మించాలని రేవులపల్లి అఖిలపక్ష కమిటీ సభ్యులు ఎంపీ డీకే అరుణమ్మకు బుధవారం వినతిపత్రం అందజేశారు. వంతెన రేవులపల్లి-నందిమల్ల మధ్య వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతరాయ, గుర్రాజు, పోస్టు వెంకటయ్య, చెట్టుకింది నర్సింహులు, అంజన్ కుమార్, బండ శ్రీను, లక్ష్మయ్య, రమేశ్ పాల్గొన్నారు.
News September 24, 2025
GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట: కలెక్టర్

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GST 2.0 వ్యవసాయం, పారిశ్రామిక, భవన నిర్మాణం, విద్యారంగం, వర్తక రంగాలకు ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసరాలు, మెడిసిన్, వ్యసాయ పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఆటోమొబైల్ రంగాల్లోని ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గిందన్నారు.