News July 9, 2025

మంథని: మహాలక్ష్మి అమ్మవారికి కూరగాయలతో అలంకరణ

image

మంథని పట్టణంలోని మహాలక్ష్మి దేవాలయంలో జరుగుతున్న ఆషాఢ మాసం శాకంబరి ఉత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీదేవి అమ్మవారిని కూరగాయలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Similar News

News July 10, 2025

MBNR: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

image

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.

News July 10, 2025

కోరుట్ల: ‘మన ఊరు-మనబడి నిధులను మంజూరు చేయించాలి’

image

పెండింగ్‌లో ఉన్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి సంబంధించిన నిధులు మంజూరు చేయించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వరద డ్యామేజ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, దేవాదాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

News July 10, 2025

జగిత్యాల: ‘పెండింగ్‌లో ఉన్న ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలి’

image

జగిత్యాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఆలయాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. వైద్య పరంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మెడికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.