News February 16, 2025

మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

image

మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన తోట రాయమల్లును ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కాలు విరగ్గా భయానకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 17, 2025

రావులపాలెం: జొన్నాడ ఫ్లైఓవర్‌పై సీఎం ఆరా

image

రావులపాలెం-జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆరా తీశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

News September 17, 2025

ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ

image

ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేందుకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులందరి వివరాలు నమోదు చేయాలని సూచించారు.

News September 17, 2025

చైతన్యపు ఖిల్లా.. మన ఖమ్మం జిల్లా

image

ఖమ్మంకు ‘చైతన్యపు ఖిల్లా’ అనే పేరు రావడానికి కారణం నాటి తెలంగాణ సాయుధ పోరాటమే. భూస్వాములు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా జరిగిన ఈపోరాటంలో జిల్లా ప్రజలు ఒడిసెలు, గొడ్డలి వంటి పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకుని పోరాడారు. నల్లమల గిరిప్రసాద్, దేవూరి శేషగిరిరావు, రజబ్ అలీ, మంచికంటి రామకిషన్‌రావు వంటి నేతలు ముందుండి నడిపారు. మీనవోలు, అల్లీనగరం, గోవిందాపురం వంటి గ్రామాలు ఉద్యమానికి ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి.