News February 16, 2025

మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

image

మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన తోట రాయమల్లును ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కాలు విరిగ్గా భయానకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 17, 2026

ADB: ‘చిట్ ఫండ్ బాధితులు ఫిర్యాదు చేయాలి’

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కనకదుర్గ, అచల, భవితశ్రీ, అక్షర, శుభనందిని చిట్ ఫండ్స్‌లో డబ్బులు కట్టి తిరిగిరాని బాధితులు ఫిర్యాదు చేయాలని డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ తెలిపారు. బాధితులు తమ రసీదులు, ఆధారాలతో కూడిన ఫిర్యాదులను ఈ ప్రకటన వెలువడిన 7 రోజుల్లోగా ఆదిలాబాద్‌లోని సహాయ చిట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News February 17, 2026

ఇమ్రాన్ కోసం కపిల్, గవాస్కర్ సహా 14 మంది మాజీ క్రికెటర్ల లేఖ

image

జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ క్రికెటర్లు ‘అంతర్జాతీయ మాజీ క్రికెట్ కెప్టెన్స్’ పేరిట లేఖ రాశారు. ఇందులో భారత లెజెండ్స్ కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కన్ను 85% చూపు కోల్పోయిందని ఇటీవల వార్తలొచ్చాయి. పాక్‌కు 1992 WC అందించిన ఇమ్రాన్, 2018-2022 మధ్య PMగా ఉన్నారు.

News February 17, 2026

పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

image

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీని మాత్రం ఎంపీ రఘునందన్ రావు తన కో-ఆప్షన్ ఓటుతో దక్కించుకోవడం విశేషం. నియోజకవర్గ రాజకీయాల్లో ఈ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.