News April 4, 2025

మంథని: వామన్‌రావు దంపతుల హత్య కేసు (UPDATE)

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Similar News

News December 20, 2025

తాండూరు: జీవిత కాలం తోడుంటానని చెప్పి చంపేశాడు!

image

వికారాబాద్ జిల్లా తాండూరులో <<18604502>>ప్రేమించి పెళ్లి చేసుకున్న<<>> భర్త పరమేశ్ తన భార్య అనూషను కర్రతో దారుణంగా కొట్టి చంపిన విషయం తెలిసిందే. వివాహ సమయంలో జీవితకాలం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త, కష్టసుఖాల్లోనూ చేయి వీడనని మాట ఇచ్చినప్పటికీ, ఆ ప్రమాణాలను మరిచి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ప్రాణభయంతో పారిపోయాడు. ఈ ఘటనతో ప్రేమ పెళ్లిళ్లపై జిల్లాలో చర్చ మొదలైంది. నేటి సమాజంలో నిజమైన ప్రేమ లేదంటున్నారు.

News December 20, 2025

పంగులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పంగులూరు మండలం చందలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. ఇంకొల్లు నుంచి వెంకటాపురం వెళుతున్న ట్రాక్టర్, అద్దంకి నుంచి చందలూరు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడు సుధాకర్ సంఘటనా స్థలంలోని దుర్మరణం చెందాడు. మృతుడిది చందలూరు గ్రామంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News December 20, 2025

నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ‘ముస్తాబు’

image

AP: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫాం, బూట్లు ధరించాలి. గోర్లు కత్తిరించుకోవాలి. జుట్టు నీట్‌గా దువ్వుకోవాలి. టాయిలెట్‌కు వెళ్లొచ్చాక, భోజనం చేసే ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రతి వారం ‘ముస్తాబు స్టార్స్’ పేర్లు ప్రదర్శిస్తారు.