News March 2, 2026
మంథని: “సర్పంచ్ నుండి అసెంబ్లీ స్పీకర్ వరకు”

మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మార్చి 2, 1935న ఉమ్మడి KNR (ప్రస్తుత భూపాలపల్లి జిల్లా) ధన్వాడ గ్రామంలో జన్మించారు. 1964-83 మధ్య ధన్వాడ సర్పంచ్‌గా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1983 నుండి వరుసగా మూడుసార్లు మంథని MLAగా గెలిచారు. ఉమ్మడి AP శాసనసభకు 11వ స్పీకర్‌గా(1991–1995) సేవలకు గుర్తిస్తూ HYD ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Similar News
News March 2, 2026
SKLM: ‘జాతీయ లోక్ అదాలత్ వినియోగించుకోవాలి’

మార్చి 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. అధికంగా రాజీలు చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.
News March 2, 2026
జగిత్యాల: ప్రజావాణిలో 62 ఫిర్యాదుల స్వీకరణ

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు మొత్తం 62 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. జిల్లా అధికారులు, తహశీల్దార్లు ఉన్నారు.
News March 2, 2026
SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకి 895 మంది హాజరు

జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు, అక్రమాలకు తావులేకుండా ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్లతో నిరంతర పర్యవేక్షణ చేశారన్నారు.


