News March 25, 2026

మంథని JNTUHకి 16 ఏళ్లు..!

image

గ్రామీణ యువతకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే సంకల్పంతో మార్చి 25, 2010న మంథని JNTUHని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. PDPL(D) రామగిరి(M) కల్వచర్లలో NAAC- ‘A+’ గ్రేడ్ గుర్తింపుతో, 52 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీ, హాస్టల్ వసతులతో అందుబాటులో ఉన్నాయి. ఈ నిర్మాణానికి సింగరేణి సహకారం అందించినందుకు ఉద్యోగుల పిల్లలకు 10% సీట్లను ప్రభుత్వం కేటాయించింది.

Similar News

News March 26, 2026

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ లాంచ్?

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా, గుర్తుగా ‘ధర్మగంట’ను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.

News March 26, 2026

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల లాభం

image

యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు.

News March 26, 2026

JNGM: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు పూజారి రమేష్ మృతి చెందిన ఘటన జనగాం జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే రమేష్ రోజు మాదిరిగానే తాడిచెట్టు ఎక్కేందుకు వెళ్ళాడు. తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు చికిత్స నిమిత్తం MGM ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.