News October 24, 2025
మంథని: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్

కార్తీక పౌర్ణమి సందర్భంగా NOV 5న అరుణాచలగిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడపనున్నట్లు డిపో మేనేజర్ వి.శ్రవణ్ కుమార్ తెలిపారు. NOV 3 సాయంత్రం మంథని నుంచి బయలుదేరి, KNR, HYD, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల తర్వాత 4న రాత్రి బస్ అరుణాచలం చేరుతుంది. 5న తిరుగు ప్రయాణం. 6న అలంపూర్ జోగులాంబ దర్శనమనంతరం మంథని చేరుకుంటుంది. టికెట్ పెద్దలకు రూ.5040, పిల్లలకు రూ.3790. 9959225923
Similar News
News October 24, 2025
28న ప్రజా ఉద్యమం: భూమన

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న ‘ప్రజా ఉద్యమం’ చేపట్టనున్నట్లు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
News October 24, 2025
ఇవాళ భారత్ బంద్

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నాయి. అటు షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.
News October 24, 2025
ప్రకాశం జిల్లాలోని పత్తి సాగు రైతులకు గుడ్ న్యూస్

జిల్లాలోని పత్తి సాగు రైతులకు JC గోపాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు జేసీ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. మార్కాపురంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు ఆయన నిర్ణయించారు. నవంబర్ నుంచి పత్తి పంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని, జిల్లాలోని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదలైంది. ఈ క్రాప్ చేయించుకున్న రైతులు మాత్రమే అర్హులుగా తెలిపారు.


