News November 1, 2025
మందమర్రి: ఏరియాలో 65% బొగ్గు ఉత్పత్తి

అక్టోబర్ నెలకు గాను మందమర్రి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి 65% బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం రాధాకృష్ణ చెప్పారు. బొగ్గు ఉత్పత్తి వివరాలను శుక్రవారం వెల్లడించారు. భూగర్భ గనుల కార్మికుల గైర్హాజర్ మూలంగా ఆశించిన బొగ్గు ఉత్పత్తి సాధించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు సూపర్వైజర్లు సమష్టిగా కృషి చేయాలన్నారు.
Similar News
News November 1, 2025
రోహిత్, కోహ్లీ కొనసాగుతారు: ఐపీఎల్ ఛైర్మన్

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసలు కురిపించారు. వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ వెళ్లిపోతారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎక్కడికీ వెళ్లరు. 50ఓవర్ల ఫార్మాట్ ఆడతారు’ అని అన్నారు. క్రికెట్ కోసం వారు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వైభవ్ సూర్యవంశీ వంటి వారితో టీమ్ ఇండియా బెంచ్ బలంగా ఉందన్నారు.
News November 1, 2025
HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపుల కలకలం

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. ఇండిగో ఫ్లైట్-68 ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానంలో IED, నర్వ్ గ్యాస్ ఉండొచ్చని అనుమానంపై BTAC అత్యవసర సమావేశం జరిగింది. ఫ్లైట్‌ను ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. GMR సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రతా విభాగాలు మెయిల్‌ను పరిశీలిస్తున్నాయి.
News November 1, 2025
GWL: విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ వసతిగృహంలో విద్యార్థులకు జరిగిన ఫుడ్ పాయిజన్ నేపథ్యంలో శనివారం కలెక్టర్ సంతోష్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన కారణాలను వైద్య సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సరిపడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.


