News February 2, 2025

మందమర్రి ఏరియాలో 91%బొగ్గు ఉత్పత్తి: GM

image

మందమర్రి ఏరియాలో జనవరి మాసానికి నిర్దేశించిన లక్ష్యానికి 91% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా GM దేవేందర్ తెలిపారు. శనివారం GMకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వివరించారు. డిసెంబర్‌తో పోలిస్తే 14,327టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించామన్నారు. అధికారులు, కార్మికులు సమష్టిగా కృషిచేసి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.

Similar News

News February 2, 2025

ఆ రోజు నుంచి నా టైమ్‌ను 8 నిమిషాలు ముందుకు జరిపా: సచిన్

image

16 ఏళ్ల వయసులో 1989లో తొలిసారి వెళ్లిన పాకిస్థాన్ టూర్ తనకు ఎంతో నేర్పిందని సచిన్ చెప్పారు. BCCI అవార్డుల వేడుకలో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్ కోసం రోజూ ఉ.9 గంటలకు హోటల్ నుంచి బస్సు వెళ్లేది. ఓ రోజు నేను ఆలస్యమవడంతో కపిల్ దేవ్ నన్ను పిలిచి ఇప్పుడు 9 అయిందా? అని అడిగారు. అప్పటి నుంచి నా వాచ్‌ టైమ్‌ను 7,8 నిమిషాలు ముందుకు జరిపా. ఆ పర్యటనతో నేనెంతో నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.

News February 2, 2025

RC16లో ఓ సీక్వెన్స్‌కు నెగటివ్ రీల్: రత్నవేలు

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్, జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో ఓ సీక్వెన్స్‌లో సహజత్వం కోసం నెగటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా అంతా డిజిటల్ అయిందని, అయితే హాలీవుడ్‌లో నెగటివ్ వాడుతున్నారని చెప్పారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

News February 2, 2025

ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ

image

రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఓ పైలట్‌ను విమానాన్ని నడిపేందుకు అనుమతించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కొరడా ఝళిపించింది. రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. గత ఏడాది జులై 7న ఆ పైలట్ నిబంధనలు ఉల్లంఘించి 3 విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశాడని పేర్కొంది. డిసెంబర్ 13న జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైన్ వేసినట్లు తెలిపింది.