News January 17, 2025
మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు

మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
Similar News
News November 4, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.
News November 4, 2025
ADB: బీసీ నేతను పరామర్శించిన కవిత

తలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News November 4, 2025
భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం..!

గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.


