News March 26, 2025
మందమర్రి: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. యాపల్ ఏరియాకు చెందిన సతీశ్ తన 15 ఏళ్ల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో బాదాడు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI వెల్లడించారు.
Similar News
News March 30, 2025
నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ

TG: రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం జనాభాలో 85 శాతం మందికి వీటిని అందిస్తారు. 3.10 కోట్ల మందికి నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,665 కోట్లు ఖర్చు చేయనుంది.
News March 30, 2025
నేడు పీ-4 కార్యక్రమం ప్రారంభం

AP: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
News March 30, 2025
సౌతాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం

వాహన డ్రైవింగ్ విషయంలో సౌతాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా నిలిచింది. అవినీతి అధికారుల వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. యూఎస్‌కు చెందిన జుటోబీ వార్షిక నివేదిక విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షిత దేశంగా నార్వే నిలిచింది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య గతేడాది సగటున 8.9 ఉండగా, ఈ ఏడాది అది 6.3కి తగ్గిందని పేర్కొంది.