News March 31, 2025
మందమర్రి: బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామన్ కాలనీ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి యువకుడు కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు 108 ద్వారా చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 8, 2026
KU: డబుల్ పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు రద్దు

డబుల్ పీజీ చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ హాస్టల్స్ అడ్మిషన్లకు అర్హులు కాదని కేయూ హాస్టల్స్ డైరెక్టర్ ఎల్సీ రాజ్‌కుమార్ బుధవారం స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి హాస్టల్‌లో చేరిన విద్యార్థులు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అడ్మిషన్ రద్దు చేసుకోవాలని సూచించారు. గడువు దాటితే హాస్టల్ అడ్మిషన్ రద్దుతో పాటు డిపాజిట్ మనీ తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
News January 8, 2026
భూపలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్‌లోని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ గృహాల గృహ నిర్మాణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. మున్సిపల్, ఎంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లదారు. అదనపు కలెక్టర్ విజయలక్మి, లోక్ నాయక్ ఉన్నారు.
News January 8, 2026
జిల్లా మలేరియా అధికారిగా నాగార్జున

జిల్లా మలేరియా నూతన అధికారిగా నాగార్జున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అధికారుల ఆదేశాలను పాటిస్తూ తనకు కేటాయించిన లక్ష్యాలను సమర్ధవంతంగా నెరవేరుస్తానని ఆయన అన్నారు. నూతన వైద్యాధికారికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


