News January 4, 2025
మందమర్రి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మందమర్రి మండలం పులిమడుగు ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. మంచిర్యాల ర్యాలీగడ్‌పూర్‌కు చెందిన రాజు(24) భీమిని మండలంలోని భీంపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకొని చనిపోయినట్లు చెప్పారు.
Similar News
News January 6, 2025
ఉమ్మడి ADBపై చలి పంజా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఆదివారం ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా అర్లి(T)లో 5.9, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(U) 6.0, నిర్మల్ జిల్లాలో పెంబి 8.0, మంచిర్యాల జిల్లాలో నెన్నెల 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గాయి.
News January 6, 2025
కౌటాల: ప్రేమజంట పెళ్లి చేసిన పోలీసులు
ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కౌటాల మండలం గురుడుపేట్‌కు చెందిన నీకా సాయికుమార్(27), కన్నెపల్లికి చెందిన మానస(20) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసినట్లు కౌటాల SI మధుకర్ తెలిపారు. ఇందులో గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
News January 6, 2025
ASF: ఎమ్మెల్సీ కవిత పర్యటన జయప్రదానికి పిలుపు
బీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని ASF ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్, కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో కవిత పర్యటిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.