News April 17, 2025
మందమర్రి: సింగరేణిలో ఉద్యోగాలు.. APPLY NOW

సింగరేణి ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రంలోని నైని బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలను చేపట్టిన యాజమాన్యం అక్కడ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సింగరేణివ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంటులో పనిచేస్తున్న ఉద్యోగులు ఈనెల 24 తేదీలోపు జీఎం (పర్సనల్) ఐఆర్, పీఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సింగరేణిలో పనిచేస్తున్న క్లర్కులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Similar News
News April 19, 2025
NZB: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య..

నిజామాబాదు లో గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహన్ని మార్చురికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.
News April 19, 2025
ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News April 19, 2025
మ భూమి రథయాత్రతో సమస్యల పరిష్కారం: విశారదన్ మహరాజ్

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర తోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సకల సమస్యల పరిష్కారానికి మార్గం లభిస్తుందని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ బస్తీల్లో కొనసాగిన మాభూమి రథయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బస్తీల్లో ఉన్న సమస్యలను వెంటనే కలెక్టర్, మునిసిపల్ అధికారులు పరిష్కరించాలని లేనిపక్షంలో తీవ్రం నిరసన ఉంటుందని అన్నారు.