News March 31, 2025

మందమర్రి: హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

image

మందమర్రిలోని పాత బస్టాండ్ వద్ద వన్ మేడి హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ మెడికల్ హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News April 2, 2025

చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్: CM

image

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి అభ్యర్థన మేరకు చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే చినగంజాంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి చేస్తామన్నారు. కొమ్ముమూరి కాలువ ఆధునికీకరణ, మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణం, మినీ స్టేడియం, మోటుపల్లి నుంచి కారిడార్ నిర్మాణానికి సీఎంకు ఎమ్మెల్యే విన్నవించారు.

News April 2, 2025

గిబ్లీ ట్రెండ్‌లోకి పుట్టపర్తి ఎమ్మెల్యే

image

సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ ఫొటోలు వైరల్‌గా మారాయి. ChatGPT ప్రవేశపెట్టిన గిబ్లీ ఫీచర్ ఉచితంగా అందుబాటులోకి రావడంతో అందరూ తెగ వాడేస్తున్నారు. ప్రముఖులూ తమ ఫొటోలను యానిమే స్టైల్‌లోకి మార్చుకుంటున్నారు. తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుతో ఉన్న ఫొటోను గిబ్లీ స్టైల్‌లోకి మార్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News April 2, 2025

SKLM: వివరాలు తెలిపిన వ్యక్తికి బహుమతి

image

జలుమూరు మండలంలో మార్చి 29వ తేదీ రాత్రి వివిధ ఆలయాల గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాతలు రాశారు. ఈ మేరకు స్పందించిన ఎస్పీ, రాతలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలియజేసిన వారికి రూ. 25వేల నగదు పురస్కారం బహుమతిగా ఇస్తామని మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

error: Content is protected !!