News February 12, 2025

మందమర్రి PHCని సందర్శించిన DMHO

image

మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గదులతో పాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోనే ఉన్న క్వార్టర్లను వారం లోపల శుభ్రం చేయించాలని ఆదేశించారు.

Similar News

News September 13, 2025

గుడిమల్లంలో 22 నుంచి దసరా ఉత్సవాలు

image

పురాతన శైవక్షేత్రమైన గుడిమల్లం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 22న కలశ పూజ, 23న బాలాత్రిపుర సుందరి, 24న గాయత్రిదేవి, 25న అన్నపూర్ణ దేవి, 26న ఆనందవల్లి, 27న మహాలక్ష్మి దేవి, 28న లలితా త్రిపుర సుందరీ దేవి, 29న సరస్వతి దేవి, 30న దుర్గాదేవి, 1న మహిషాసుర మర్దిని, 2న రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనం ఉంటుంది.

News September 13, 2025

జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

image

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 13, 2025

నిండుకుండల శ్రీరామ్ సాగర్

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. శనివారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.501 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి భారీగా 1,08,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 23 గేట్లు ఎత్తి 91,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఐఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్కేప్ గేట్లు, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.