News October 7, 2025
మందసలో వివాహిత సూసైడ్

మందస(M) మఖరజోలకు చెందిన కూర్మమ్మ (22) సోమవారం సూసైడ్ చేసుకుంది. కడుపునొప్పి తాళలేక జీడీ తోటల్లో ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈమె భర్త ఖతర్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల కడుపునొప్పిగా ఉందని కన్నవారి ఇంటికి రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఇంతలోనే కూరమ్మ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లి పద్మ ఫిర్యాదుతో కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి కేసు నమోదు చేశారు.
Similar News
News October 7, 2025
కుమారుడు వేదనను కలెక్టర్‌కు చెప్పుకున్న తల్లి

సోమవారం శ్రీకాకుళంలోని పీజీఆర్‌ఎస్‌కు కనుగులువానిపేటకు చెందిన సోనియా అచేతనంగా ఉన్న నాలుగేళ్ల కూమారిడితో వచ్చింది. ఆ బాలుడు పడుతున్న వేదనను కలెక్టర్‌కు చెప్పుకుంది. రేండేళ్లకే పిట్స్ వచ్చి ఎదుగుదల లేక మంచానికే పరిమితమయ్యాడని, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి బెడ్ రెస్ట్ పింఛన్ రూ.15,000 ఇవ్వాలని కోరింది. తల్లి ఒడిలో చైతన్యం లేకుండా ఉన్న బాలుడ్ని చూసిన అర్జీదారుల మనస్సు కలవరానికి గురిచేసింది.
News October 7, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➲జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్
➲SKLM: పీజీఆర్ఎస్‌కు 104 దరఖాస్తులు
➲వంశధార,నాగావళి నదులకు తప్పిన వరద ముప్పు
➲అధికారులతో పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
➲ఎచ్చెర్ల: జగనన్న కాలనీలో సదుపాయాలు ఏవీ?
➲టెక్కలి: 50వేలు గాజులతో లలితాత్రిపుర సుందరీ, రాజరాజేశ్వరి అమ్మవార్లకు అలంకరణ
➲ గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన మంత్రి అచ్చెన్న
➲అరసవల్లి: ఆదిత్యుని ఆదాయం రూ.5.9 లక్షలు
News October 6, 2025
మెళియాపుట్టి: కరెంట్ షాక్‌తో 30 ఏళ్ల యువకుడి మృతి

ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా కరెంటు షాక్‌తో ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి(M) గంగరాజపురం గ్రామానికి చెందిన చంటి(30) ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూపై కప్పునకు ఉన్న కరెంట్ వైర్ తగిలి మరణించాడు. అక్క దమయంతి ఫిర్యాదుతో ఎస్ఐ రమేష్ బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.