News March 26, 2024

మందస: విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి

image

మందస మండలం చిన్న సువర్ణపురం గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లోకి సాలిని గున్నయ్య (40) అనే వ్యక్తి పనికి వెళ్లాడు. పని చేస్తూ అక్కడే ఉన్న ఓ ఇనుప చువ్వను ముట్టుకున్నాడు. దానికి కరెంట్ ప్రసరించడంతో ఆయన కరెంట్ షాక్‌కు గురయ్యాడు. సహచరులు గమనించి 108 అంబులెన్స్ సమాచారం అందిచారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News February 21, 2026

ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్‌సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని అన్నారు.

News February 21, 2026

శ్రీకాకుళం: మహిళ పొట్ట నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు

image

కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి శనివారం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి 3.3 కిలోల కణితిని ఆ మహిళ పొట్ట నుంచి బయటకు తీశారు. పేషంట్ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని, అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశామన్నారు.

News February 21, 2026

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాయనున్నారంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు మధ్య పరీక్షలు జరగనున్నాయి.