News January 27, 2025

మక్కువ: శంబర జాతరకు పటిష్ట బందోబస్తు

image

శంబర జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి అన్నారు. శంబర సందర్భంగా శంబర గ్రామంలో పోలీసు సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద నిగా మరింత పటిష్టపరిచి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News February 22, 2026

చిక్కిపోతున్న చందమామ!

image

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని నేషనల్ ఎయిర్&స్పేస్ మ్యూజియానికి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రకంపాల వల్ల ఏర్పడే పగుళ్లే ఇందుకు కారణమని చెబుతున్నారు. చందమామపై పగుళ్ల గురించి శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలిసినా తాజాగా లూనార్ మారియా ప్రాంతాల్లో 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. వీటిని స్మాల్ మేర్ రిడ్జెస్ అని పిలుస్తున్నారు.

News February 22, 2026

HYD: 80% సబ్సిడీతో ఈ-స్కూటర్లు

image

మైనారిటీ యువత ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ-స్కూటర్స్ పంపిణీ పథకం అమలు చేస్తున్నట్లు RR జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ- స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా అందులో 80% సబ్సిడి ( రూ.1.20 లక్షలు) ప్రభుత్వం అందిస్తుందని మిగిలిన 20%(రూ.30,000) లబ్ధిదారుడి వాటా కింద చెల్లించాలన్నారు.
# SHARE IT

News February 22, 2026

సిద్దిపేట: కత్తితో పొడిచి చంపారు.. తల్లీకొడుకుల అరెస్ట్

image

దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన <<19197727>>హత్య కేసు<<>>లో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మృతుడు వంగ బాల్‌రెడ్డి (61)ని శుక్రవారం కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ రాజేశ్ తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ వివాదంపై పాత విభేదాలు కొనసాగుతుండగా, నిందితులు వంగ రేణుక (55), ఆమె కుమారుడు సోమేశ్వర్ (26) కలిసి బాల్ రెడ్డిని హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.