News February 11, 2026
మక్తల్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి: ఎస్పీ వినీత్

మక్తల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంతో పాటు గార్లపల్లిలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఆయన నిశితంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి భద్రతా పరమైన సూచనలు చేస్తూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
సంగాం సంగమేశ్వర స్వామి ఆలయ విశిష్టత(2/2)

ఈ 5 ప్రాంతాలలో 5 లింగాలను ఏకకాలంలో బలరాముడు ప్రతిష్టించి పూజలు నిర్వహించి బ్రహ్మహత్య మహాపాతకమును తొలగించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు కలిసే సంగమేశ్వర స్వామి ఆలయం అతి విశిష్టమైనది. గంగా, యమునా, సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమం పేరుగాంచిన అలహాబాద్ తర్వాత సంగాం పేరుగాంచింది. మహాశివరాత్రికి వేలాది భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు.
News February 12, 2026
డిప్యూటీ సీఎంకు కోనసీమ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

కోనసీమలో రోడ్ల అభివృద్ధికి రూ.65.15 కోట్ల నిధులు కేటాయించినందుకు గాను ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, ఆనందరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో నాలుగు నియోజకవర్గాల్లో 40 ప్రధాన రోడ్లను నిర్మించనున్నారు. ముఖ్యంగా వాడపల్లి కరకట్ట రోడ్డుకు రూ.6 కోట్లు మంజూరు చేయడంపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.
News February 12, 2026
తిరుపతి: IRS హోదా లేకపోయినా..!

రూ.2 వేల కోట్లు పైన ఆదాయం ఉన్న ఏ సంస్థకైనా IRS అధికారి FA&CAOగా ఉండాలి. టీటీడీ ఏర్పాటు నుంచి 2017 వరకు అదే జరిగింది. క్లర్క్ (ప్రైవేట్ ఉద్యోగి) స్థాయి నుంచి రెండేళ్ల పాటు ఇన్‌ఛార్జ్ FA&CAOగా పనిచేసే వరకు వెళ్లారు. ఆ తర్వాత అప్పటి అధికార, రాజకీయ పలుకుబడితో పూర్తి పదవిని నిబంధనలు సడలించి చేజిక్కించుకున్నారు. అప్పట్లో దీనిపై ఓ వ్యక్తి పోరాటం సైతం చేశారు.


