News January 5, 2026
మక్తల్: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కెమిస్ట్రీలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55% మార్కులతో పాసై ఉండాలని అలాగే నెట్, సెట్, పీహెచ్డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 8వ తేదీన ఎంపిక పరీక్ష ఉంటుందన్నారు.
Similar News
News February 13, 2026
RGM: ఎరువుల ఉత్పత్తికి సంపూర్ణ సహకారం: కలెక్టర్

రామగుండం RFCLలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ఎరువులు ఉత్పత్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఆయన కర్మాగారంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్, ప్రిల్లింగ్ టవర్, బ్యాగింగ్, లోడింగ్, డిస్పాచ్ విభాగాలను పరిశీలించారు. తెలంగాణ రైతులకు యాసంగి సీజన్లో 2,14,223 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినందుకు యాజమాన్యాన్ని అభినందించారు.
News February 13, 2026
నల్గొండ: ‘ప్రజావాణి’ ప్రారంభం

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడంతో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ సోమవారం నుంచి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలను యథావిధిగా స్వీకరిస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 13, 2026
ఎంజీయూ B.Ed ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఎంజీయూ పరిధిలోని B.Ed సెమిస్టర్-3 రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం ఎగ్జామినర్ల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-A కాలేజీలకు, 19, 20 తేదీల్లో గ్రూప్-B కాలేజీలకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.


