News December 1, 2025
మక్తల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎనలేనిది: మంత్రి వాకిటి

మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేశారని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. సోమవారం మక్తల్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. ఆయన గత రెండేళ్లలో రోడ్లు, ఆసుపత్రులు, నీటిపారుదల వంటి పలు పనుల కోసం భారీగా నిధులు అందించినందుకు ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు.
Similar News
News April 15, 2026
అనపర్తి ‘సెంటిమెంట్’ ఏంటో తెలుసా?

1952లో అనపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది. 14 సార్లు జరిగిన ఎన్నికలలో 12 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. అయితే, ఒక వింతైన విషయం ఏమిటంటే, అనపర్తి నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా అవకాశం పొందలేదు. దీనిని స్థానికులు ఒక ‘సెంటిమెంట్’గా భావిస్తారు.

కాకినాడ: 300 ఏళ్ల చరిత్ర.. అగ్గిపెట్టెలో పట్టే చీర!

ఉప్పాడ పట్టు చీరల్లో వాడే ‘జామ్దానీ’ పద్ధతి మూలాలు బంగ్లాదేశ్‌లో ఉన్నాయని చాలా మందికి తెలియదు. 18వ శతాబ్దంలో ఈ పద్ధతిని దక్షిణ భారతదేశానికి తీసుకురాగా, ఉప్పాడ నేతన్నలు దానిని మరింత ఆధునీకరించి ఒక విశిష్ఠ శైలిని రూపొందించారు. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళను ఉప్పాడ నేతన్నలు అద్భుతంగా మలచుకున్నారు. అత్యంత తేలికగా ఉండే ఈ చీరలను ఒక చిన్న అగ్గిపెట్టెలో పట్టేంత నైపుణ్యంతో నేయడం వీరి ప్రత్యేకత.