News December 1, 2025

మక్తల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర నిర్ణయాలు: మంత్రి

image

మక్తల్ ప్రాంత అభివృద్ధి దశాబ్దాలుగా మాటల్లోనే మిగిలిపోయిందని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. కృష్ణా నది పక్కన ఉన్నా వ్యవసాయానికి నీరు లేక ప్రజలు వలసబాట పట్టే పరిస్థితి ఎదురయ్యేదని గుర్తుచేశారు. అయితే సీఎంరేవంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 5 వేల కోట్లతో, లక్ష ఎకరాలకు నీరు చేరేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి “అపర భగీరథుడు” అన్నారు. ముఖ్యమంత్రికి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 3, 2025

చలికాలంలో చర్మం బాగుండాలంటే?

image

ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ వాతావరణంలో తేమ తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద లాంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే సెరమైడ్స్, షియా బటర్, హైలురోనిక్‌ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడాలి. పెదాలకీ విటమిన్‌ ఇ, షియాబటర్‌ ఉన్న లిప్‌బామ్‌ మంచిది. ఇవి చర్మానికి తేమని, ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. ఈ కాలంలో హెవీ క్రీములు కాకుండా మీ చర్మానికి సరిపడేవి రాసుకోవాలని సూచిస్తున్నారు.

News December 3, 2025

HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

image

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.

News December 3, 2025

అల్లూరి: పేరెంట్స్ మీట్‌కు రూ.54.92లక్షల విడుదల

image

అల్లూరి జిల్లాలో ఈనెల 5న జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు ప్రభుత్వం రూ.54.92 లక్షలు విడుదల చేసిందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని టీచర్స్&పేరెంట్స్ సహకారంతో నిర్వహించాలన్నారు. ప్రతీ పేరెంట్‌కు ఆహ్వానం అందించాలన్నారు. 2,913 ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.