News February 10, 2026

మక్తల్: ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు: ఎస్పీ

image

మక్తల్ పట్టణంలో ఇవాళ తెల్లవారుజామున బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు BNS సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆత్మహత్య ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేసి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా సహకరించాలని ప్రజలను కోరారు.

Similar News

News February 22, 2026

వర్షం దెబ్బ.. పాకిస్థాన్ సెమీస్ లెక్కలు తలకిందులు!

image

కొలంబోలో శనివారం పాక్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే లేకపోవడంతో ఇరు జట్లు పాయింట్లను పంచుకున్నాయి. దీంతో పాక్ సెమీస్ చేరాలంటే తర్వాతి 2 మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకే ఒక్క పాయింట్‌తో సల్మాన్ అలీ ఆఘా సేన సెమీస్ పోరు క్లిష్టంగా మారింది.

News February 22, 2026

సంగారెడ్డి: ‘విదేశీ విద్యా నిధికి దరఖాస్తు చేసుకోవాలి’

image

విదేశాల్లో చదువు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేశ్ రెడ్డి శనివారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.inలో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వరకు విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.

News February 22, 2026

PDPL: మాజీ మావోయిస్టు కీలక వ్యాఖ్యలు

image

‘నేను ప్రజల్లోనే ఉన్నా.. ఉంటా’ అని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ రావు అన్నారు. త్వరలోనే పుట్టిన గడ్డ తెలంగాణకు వస్తానని శనివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, అడవి నుంచి బయటకు వెళ్లి రాజ్యాంగ బద్దంగానే పోరుడుదామని కమిటీ సభ్యులకు చెబితే.. కొందరు మాత్రమే వ్యతిరేకించారని చెప్పారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కాగా, ఆయనది పెద్దపల్లి జిల్లా.