News August 24, 2025
మక్తల్: గుర్తుతెలియని బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతి

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలిక బొలెరో వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి మక్తల్ మండల పరిధిలోని సంఘం బండ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామ సమీపంలో నివాసం ఉంటున్న కృష్ణవేణి(12) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని ఓ బొలెరో తనను ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News August 25, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 25, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.35 గంటలకు
✒ ఇష: రాత్రి 7.49 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 25, 2025
కాశినాయన: బాల్ బ్యాట్మెంటన్‌లో సత్తా చాటిన విద్యార్థులు

రాజంపేటలో ఆదివారం జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో కాశినాయన మండలం నరసాపురం ZPHS విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి కడప జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్స్ విభాగంలో ఇర్ఫాన్, సంపత్, సీనియర్ విభాగంలో సోహెల్ ఈ నెల 29, 30, 31వ తేదీలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వారిని పలువురు అభినందించారు.
News August 25, 2025
తంబళ్లపల్లె: షూటింగ్ బాల్ జూనియర్ జట్టుకు ముగ్గురు ఎంపిక

తంబళ్లపల్లె (M) కన్నెమడుగు హై స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్ధినులు జూనియర్ షూటింగ్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారని పీడీ ఖాదర్ బాషా తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధినులు రిషిత, ప్రియ ప్రవల్లికతో పాటు స్టాండ్ బైగా స్వాతి ఎంపికయ్యారన్నారు. మదనపల్లెలోని ఓ పాఠశాలలో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ జునైద్ అక్బరీ, కార్యదర్శి గౌతమి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జట్టు ఎంపిక జరిగింది.