News December 12, 2025

మక్తల్: పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి

image

సర్పంచ్ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా మక్తల్ నియోజకవర్గానికి చెందిన మక్తల్, కృష్ణ, నర్వ, ఉట్కూరు, మగనూరు మండలాల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 244 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మిగిలిన వారు ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం సాయంత్రం 5 లోపు ఓటు వినియోగించుకోవాలని చెప్పారు.

Similar News

News March 26, 2026

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ గురువారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ప్రతీ ఇంట సుఖశాంతులు, సౌభాగ్యాలు విరాజిల్లాలని ఆకాంక్షించారు. ధర్మం, సత్యం, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు.

News March 26, 2026

వేములవాడ: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. నలుగురికి గాయాలు!

image

వేములవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో బస్సు.. కారును ఢీకొట్టి రోడ్డు డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలైనట్లు సమాచారం. బస్సులో ఉన్నవారు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2026

గిరిజన ఉత్పత్తులకు ‘భద్రగిరి మార్ట్’ బ్రాండింగ్

image

భద్రాచలంలో గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గిరిజన మ్యూజియం సరసన ఇప్పుడు మరో అద్భుత కట్టడం చేరింది. గిరిజన ఉత్పత్తులను ఒకే చోట విక్రయించేందుకు వీలుగా భద్రాచలం ITDA ఆధ్వర్యంలో ‘భద్రగిరి మార్ట్‌’ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ITDA PO తన మార్కు నూతన ఆవిష్కరణలతో ఈ మార్ట్‌ను అద్భుతంగా రూపొందించారు. గిరిజన రైతులు, మహిళా సంఘాలు తయారుచేసే సహజ సిద్ధమైన ఉత్పత్తుల విక్రయాలకు ఈ భవనాన్ని నిర్మించారు.