News October 3, 2025

మక్తల్: భార్యను నమ్మించి దారుణ హత్య

image

మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యారం గ్రామంలో శుక్రవారం భార్య వినోద (32)ను భర్త కృష్ణారెడ్డి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పొలం వద్ద జరిగిన దసరా దావత్ అనంతరం కుటుంబ సభ్యులను పంపేసి ఒంటరిగా మాట్లాడుతానని నమ్మించి గొంతు కోసి, శరీరంపై పలుచోట్ల కత్తితో గాయపరిచి చంపాడు. అతడికి గత నేర చరిత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నాడు.

Similar News

News October 3, 2025

జియాగూడ మేకల మండి ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్

image

జియాగూడ మేకల మండి ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అనుమతులు ఇచ్చింది. త్వరలోనే ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. సుమారుగా రోజు 6,000 మేకలను వధించే సామర్థ్యంతో నూతన భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. చెంగిచెర్లలోని కబేలాను కూడా ఆధునీకరించాలని అక్కడికి వెళుతున్న పలువురు వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News October 3, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

☞ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభం
☞ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో విలన్‌గా షైన్ టామ్ చాకో?
☞ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్
☞ కొనసాగుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. అక్టోబర్ 31న థియేటర్లలోకి

News October 3, 2025

AIDSపై విస్తృత ప్రచారం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో AIDS వ్యాధిపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ ప్రాంగణంలో ఆరోగ్య ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలందరికీ AIDS వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు.