News October 8, 2025

మక్తల్: భార్యను హతమార్చిన భర్త అరెస్ట్

image

మక్తల్ మండలం<<17905844>> సత్యారాం<<>> గ్రామంలో ఈనెల 3న జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. భార్య వినోదను భర్త కృష్ణారెడ్డి హతమార్చినట్లు గుర్తించారు. వినోద తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణారెడ్డి ప్లాన్ ప్రకారం హైదరాబాద్ డిమార్టులో కత్తిని కొనుగోలు చేశాడు. దాన్ని స్కూటీలో పెట్టుకొని గ్రామానికి వెళ్లిన అతడు భార్యతో గొడవ పడి హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News October 8, 2025

ఏలూరులో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అండర్-14, 17 బాలబాలికల జిల్లా స్థాయి క్రీడా పోటీల ఎంపికలు ఈనెల 10న జరుగుతాయని SGF సెక్రటరీ కె. అలివేలుమంగ తెలిపారు. బాస్కెట్‌బాల్ కొవ్వలిలో, వ్రేస్లింగ్ ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరుగుతాయన్నారు. పాల్గొనేవారు ఉదయం 9 గంటలకు ఎంట్రీ ఫారమ్, క్రీడా దుస్తులతో హాజరుకావాలన్నారు.

News October 8, 2025

పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: నిర్మల్ కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ మీడియా మానిటరింగ్‌ సర్టిఫికేషన్‌ కమిటీ (ఎంసిఎంసి)ని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ప్రారంభించి అధికారులతో మాట్లాడారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తపై నిఘా ఉంచాలని సూచించారు.

News October 8, 2025

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: నోడల్ అధికారి

image

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా సహకార, ఎన్నికల వ్యయ నోడల్ అధికారి గంగాధర్ అధికారులను ఆదేశించారు. డీపీఆర్‌సీ భవనంలో బుధవారం జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్రమ నగదు, బంగారం, ఉచితాల పంపిణీని అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా పాటించాలని ఆయన కోరారు.