News February 11, 2026

మక్తల్ 6వ వార్డుకు రీ-నోటిఫికేషన్: రాణి కుముదిని

image

మక్తల్ 6వ వార్డులో ఎన్నికల ప్రక్రియను మళ్లీ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న ఆమె, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా, స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని కోరారు.

Similar News

News February 18, 2026

విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 18, 2026

వేములవాడ: మహిళ అనుమానాస్పద మృతి..!

image

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన వెంగళ రోహిణి (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కథలాపూర్ మండలానికి చెందిన రోహిణికి వెంగళ దినేష్‌తో 8 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుందని, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా రోహిణి మరణించిందని స్థానికులు తెలిపారు.

News February 18, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,140
* 10 గ్రాములు వెండి ధర రూ.2,460.