News February 17, 2026

మక్తల్: 6వ వార్డు అభ్యర్థిగా ఎరుకల సత్యమ్మ

image

మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు BJP అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఓటింగ్ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. కాగా తాజాగా అక్కడి నుంచి దివంగత మహదేవప్ప భార్య ఎరుకల సత్యమ్మ పోటీ చేస్తుందని BJP కార్యవర్గ సభ్యులు కొండయ్య తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తనపై పార్టీ నుంచి గాని ఇతరుల నుంచి గాని ఎటువంటి ఒత్తిడి లేదని తన భర్త ఆశయాలకై తానే స్వయంగా బరిలో దిగుతున్నానని స్పష్టం చేశారు.

Similar News

News February 18, 2026

ఈక్రాప్ నమోదును వేగంగా పూర్తి చేయాలి: నెల్లూరు కలెక్టర్

image

ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పంట యాప్ నుంచి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసేటప్పుడు ఆధార్ ఫోన్ నెంబర్ సరిచూడాలన్నారు. రైతు గండవరపు అమర్నాథ్ రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.

News February 18, 2026

NZB: పసుపు రైతు అభివృద్ధే దేశాభివృద్ధి: పసుపు బోర్డు ఛైర్మన్

image

పసుపు రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో టర్మరిక్ బోర్డు మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. దేశంలోని పసుపు రైతుల సంక్షేమం, ఎగుమతుల విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపు బ్రాండ్ బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. పసుపు రైతుల భవిష్యత్తు బలోపేతం కావాలంటే ప్రభుత్వ, రైతు, వ్యాపార వర్గాల సమన్వయం అత్యవసరమని అన్నారు.

News February 18, 2026

జగిత్యాల: ‘ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలి’

image

విద్యార్థులు ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ పేర్కొన్నారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ఉపాధి కల్పన కార్డు నమోదు కార్యక్రమంపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది లైన కుమారి, ప్రసన్న, సదానందం లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యార్థులకు చూపించారు.