News September 21, 2025
మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ. 240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ. 240, స్కిన్‌లెస్ రూ. 260కు అమ్ముతున్నారు. మటన్ ధర పట్టణంలో కిలో రూ.1000 ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News September 28, 2025
హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉంచి కేసుల పరిష్కారంలో జాప్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట గస్తీని పెంచాలన్నారు.
News September 27, 2025
మచిలీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లు పంపిణీ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్‌లో పని చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా శానిటేషన్ కిట్లు అందజేశారు. పరిసరాలను శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు.
News September 27, 2025
ఈ పంట నమోదలో ఆలస్యం వద్దు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో ఈ-పంట నమోదు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.