News January 8, 2025

మచిలీపట్నంలో దారుణ హత్య

image

మచిలీపట్నంలో ఓ వ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలపూడికి చెందిన రవి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రవిని హుటాహుటిన సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 8, 2025

కూచిపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

మొవ్వ మండలం కూచిపూడి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయ్యంకి అడ్డరోడ్డు వద్ద మోటార్ సైకిల్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న అయ్యంకి గ్రామానికి చెందిన నాగరాజు(39), పెద్ద మునేశ్వరరావు (60) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

News January 8, 2025

కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28,30, ఫిబ్రవరి 1,3 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

News January 8, 2025

కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన కలంకారీ ఆర్టిజాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్‌ను కలిసి పెడనలో ఏర్పాటు చేయనున్న కలంకారీ క్లస్టర్ గురించి చర్చించారు.