News October 5, 2025

మచిలీపట్నంలో నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

మచిలీపట్నంలో చికెన్, మటన్ ధరలు గత వారం రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. చికెన్ విత్ స్కిన్ కిలో ధర రూ. 200 ఉండగా స్కిన్ లెస్ కిలో ధర రూ. 220 అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మటన్ కిలో ధర మచిలీపట్నంలో రూ. 1000 ఉండగా, పల్లెల్లో కిలో మటన్ ధర రూ. 800కి విక్రయాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న మాంసం దుకాణదారులు మొత్తం ఈ రేట్లకే అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

Similar News

News October 6, 2025

ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ రైతుల కలలకు రూపం

image

ఉయ్యూరులోని షుగర్ ఫ్యాక్టరీ 1941లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి చక్కెర తయారీ యూనిట్లలో ఒకటిగా పేరు గాంచింది. ఈ ఫ్యాక్టరీని ప్రస్తుతం KCP షుగర్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ఇది కేవలం చక్కెరే కాకుండా, స్పిరిట్, ఇథనాల్, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది చెరకు రైతులకు నాణ్యమైన ధర కల్పించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి, స్థానికులకు ఉపాధి అవకాశాలను అందిస్తూ వారి కలలకు రూపం ఇస్తోంది.

News October 6, 2025

కృష్ణా: ట్రామాకేర్ యూనిట్‌ను ఆచరణలోకి తేవాలి

image

కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని 16వ జాతీయ రహదారిపై రోజువారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలు, వేగ నియంత్రణ లోపం కారణంగా ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి రహదారిపై ప్రత్యేకంగా ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటును ఆచరణలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

News October 6, 2025

కృష్ణాజిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ ఎంపికలు ఈనెల 7న ఉదయం 9 గంటలకు నున్న ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమవుతాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల HM సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు.