News July 8, 2025

మచిలీపట్నంలో రూ.7.88 లక్షల జరిమాన

image

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. 34 బృందాలుగా ఏర్పడిన అధికారులు జరిపిన తనిఖీల్లో 230 సర్వీసులపై అదనపు లోడును గుర్తించి రూ.7.88 లక్షల మేర జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వాసు హెచ్చరించారు.

Similar News

News August 31, 2025

మచిలీపట్నంలో రేపు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News August 31, 2025

కృష్ణా జిల్లా సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న జిల్లా సీనియర్ పురుషుల, మహిళల జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య నగర పాలక సంస్థ స్టేడియంలో ఉదయం 7 గంటలకు ఈ ఎంపికలు జరుగుతాయని అసోసియేషన్ కార్యదర్శి డి. దిలీప్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.

News August 30, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ మచిలీపట్నంలో మహిళ చెయ్యి నరికిన వ్యక్తి
☞ పదవుల ఆశించిన వారికి న్యాయం చేస్తాం: పెడన ఎమ్మెల్యే
☞ మచిలీపట్నంలో బార్ లైసెన్సులకు లక్కీ డ్రా
☞ కృష్ణా జిల్లాలో పలుచోట్ల వినాయక నిమజ్జనాలు
☞ పెడన మున్సిపల్ సమావేశంలో వాగ్వాదం
☞ బుడమేరు వరదలకు ఏడాది పూర్తి..!
☞ నాగాయలంక వద్ద తగ్గు ముఖం పట్టిన వరద