News March 13, 2025

మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

image

మచిలీపట్నంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వెళ్తున్న లారీ కాలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కుడి కాలు పాద భాగం నుజ్జు నుజ్జైంది. క్షతగాత్రుడిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 18, 2025

20న గుణదలలో జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20న గుణదలలో సీనియర్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు ఎవరైనా ఒరిజినల్ ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ప్రకాశం జిల్లా కరేడులో డిసెంబర్ 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.

News December 18, 2025

కృష్ణా: 22కి ఉద్యోగుల గ్రీవెన్స్ మార్పు- కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న జరగాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశం 22వ తేదీకి వాయిదా పడిందని కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. అధికారిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.

News December 18, 2025

రేపు కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం

image

ఈనెల 19వ తేదీన కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు.