News August 24, 2025

మచిలీపట్నంలో సైకిలింగ్ చేసిన ఎస్పీ

image

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు స్వయంగా సైకిలింగ్‌లో పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి కోనేరుసెంటర్ వరకు జరిగిన సైకిలింగ్‌లో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, వందలాది మంది పోలీసులు పాల్గొన్నారు.

Similar News

News August 24, 2025

మచిలీపట్నంలో రేపు మీకోసం కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ DK బాలాజీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు అందించి పరిష్కారం పొందాలని సూచించారు.

News August 24, 2025

కృత్తివెన్ను: ఇద్దరి యువకులపై పోక్సో కేసు

image

కృత్తివెన్ను మండలంలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరొక యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించినామని చెప్పారు. 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News August 24, 2025

పెనమలూరు: కీలిమంజారో విజయం.. కలెక్టర్ ప్రశంస

image

పెనమలూరు మండలానికి చెందిన అనుమోలు ప్రభాకరరావు ఇటీవల ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఆయన కలెక్టర్ డి.కె. బాలాజీ కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ ఘట్టం ప్రేరణగా, యువతలో జైవిక, పర్యాటక అవగాహన పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.