News April 15, 2025

మచిలీపట్నం: అవనిగడ్డలో మెగా జాబ్ మేళా

image

ఈ నెల 17న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

Similar News

News April 16, 2025

కృష్ణా: జిల్లాలో నీటి చౌర్యం కాకుండా చూడండి- కలెక్టర్

image

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా, జిల్లాలో ఉన్న 266 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లను పూర్తిస్థాయిలో నింపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీటి స్థితిగతులపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన నీరు చౌర్యానికి గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలపై నిఘా పెంచాలన్నారు.

News April 15, 2025

కృష్ణా: ధాన్యం సేకరణకు 128 మిల్లులకు అనుమతులు

image

ఖరీఫ్ మిగులు ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. 128 రైస్ మిల్లులకు ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చామన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచామన్నారు.

News April 15, 2025

మచిలీపట్నం: రెవెన్యూ సమస్యలపై దృష్టిసారించాలి – కలెక్టర్

image

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ సమస్యలపై జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల అలినేషన్, 22Aలో ఉన్న ప్రైవేటు భూములు, భూముల అసైన్మెంట్, ఇనాం భూములు, ROR & వెబ్ ల్యాండ్, రీసర్వే తదితర రెవెన్యూ అంశాలలో తలెత్తుతున్న సమస్యలను చర్చించారు.

error: Content is protected !!