News March 27, 2024

మచిలీపట్నం: కలెక్టర్‌ను కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారిణి

image

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతం అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబును డీఈఓ తాహేరా సుల్తానా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాశాఖ పట్ల గౌరవం కనబరిచిన కలెక్టర్‌కు డీఈవో పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో ఘంటసాల మండల ఎంఈఓ మోమిన్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 28, 2024

ఇబ్రహీంపట్నం: బాలికపై పాస్టర్ అత్యాచారం.. కేసు నమోదు

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్‌ని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపల్లిలో నివాసముంటున్న బాలిక కుటుంబానికి పాస్టర్ దగ్గరి బంధువు. తెలంగాణ నుంచి అప్పుడప్పుడు కొండపల్లిలోని బాలిక నివాసానికి వచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News December 28, 2024

VJA: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. సీఐ కొండలరావు తెలిపిన సమాచారం మేరకు.. చిట్టినగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక(14)ను వించిపేటకు చెందిన చెన్నా రవీంద్ర అనే యువకుడు మాయమాటలు చెప్పి ఈనెల 26న అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.

News December 28, 2024

కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలన్నారు.