News August 21, 2025

మచిలీపట్నం: పీ-4 అమలుపై కలెక్టర్ సమీక్ష

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ డీకే బాలాజీ పి-4 పథకం అమలుపై బుధవారం సమీక్షించారు. ఉన్నత వర్గాల ప్రజలను మార్గదర్శిలుగా స్వచ్ఛందంగా చేరేలా చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 53,759 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. 48,375 కుటుంబాలు 4,272 మార్గదర్శులతో అనుసంధానం అయినట్లు తెలిపారు. పేదలను ఆర్థికంగా, విద్యలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.

Similar News

News August 21, 2025

కృష్ణా: గణేష్ ఉత్సవాలకు ఆంక్షలివే..!

image

కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు వినాయక చవితి సందర్భంగా మండప నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. మట్టి విగ్రహాలే వాడాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తి గీతాలు మాత్రమే వినిపించాలని, DJలు, బాణసంచా, శబ్ద కాలుష్యం, రోడ్ల ఆక్రమణలు నిషేధమని హెచ్చరించారు.

News August 20, 2025

మచిలీపట్నం: ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

image

ధాన్యం సేకరణపై కలెక్టర్ డీకే బాలాజీ జేసీ గీతాంజలి శర్మతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. నవంబర్ మొదటి వారంలో వరి పంట చేతికి రానున్నందున రైతు సేవా కేంద్రాలు, మిల్లర్లు, గోనె సంచులు, రవాణా వాహనాలు, ఎఫ్‌సీఐ గోదాములు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News August 19, 2025

విజయవాడ: సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు. రేపటికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కృష్ణా జిల్లా అవనిగడ్డ, NTR జిల్లా విజయవాడ, కృష్ణా ఘాట్‌లలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.