News June 29, 2024

మచిలీపట్నం: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. ఐదేళ్ల జైలు శిక్ష

image

బాలిక స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మచిలీపట్నం పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. మైలవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2015లో స్నానం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన రాజా అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష , రూ.4వేల జరిమానా విధించారు.

Similar News

News December 29, 2025

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News December 28, 2025

కోడూరు పంట కాలువలో మృతదేహం కలకలం

image

కోడూరు-అవనిగడ్డ ప్రధాన పంట కాలువలో సుమారు 25 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ చాణిక్య తెలిపారు. ఆదివారం మాచవరం గ్రామం వద్ద కాలువలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే కోడూరు లేదా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు.