News February 26, 2025

మచిలీపట్నం: రామలింగేశ్వరుడిని దర్శించుకున్న కలెక్టర్

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి మచిలీపట్నం రాబర్ట్ సన్ పేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Similar News

News February 27, 2025

కృష్ణా: ఎన్నికలకు సర్వ సిద్ధం

image

ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు(గురువారం) 27వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరగాలని పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గంగాధర్ రావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు.

News February 26, 2025

కృష్ణాజిల్లా టాప్ న్యూస్

image

* శివనామస్మరణలతో మార్మోగిన శైవ క్షేత్రాలు* పెదకళ్లేపల్లి నాగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు* రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు* డ్రై డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల దాడులు.. మచిలీపట్నం స్టేషన్ పరిథిలో ముగ్గురు అరెస్ట్* ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో రేపు జిల్లాలో విద్యా సంస్థలకు శెలవు

News February 26, 2025

MTM: ప్రారంభమైన పోలింగ్ మెటీరియల్ పంపిణీ 

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభమైంది. స్థానిక నోబుల్ కాలేజ్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ని ఏర్పాటు చేయగా పోలింగ్ కేంద్రాల వారీగా మెటీరియల్ పంపిణీని అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

error: Content is protected !!