News May 13, 2024
మచిలీపట్నం 144వ నంబర్ పోలింగ్ బూత్ EVMలో సాంకేతిక లోపం
మచిలీపట్నం 39వ డివిజన్ పరిధిలోని 144వ నంబర్ పోలింగ్ బూత్‌లో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన EVMలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. మాక్ పోల్‌లో EVM స్ట్రక్ అయింది. అధికారులు అప్పటికప్పుడు సాంకేతిక లోపాన్ని పరిష్కరించారు.
Similar News
News November 30, 2024
కృష్ణా: పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు
గుంతకల్ డివిజన్లో భద్రతా పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్‌పూర్(YPR) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు డిసెంబర్ 6న, నం.22884 YPR-PURI రైలు డిసెంబర్ 7న నంద్యాల-డోన్ మీదుగా కాక నంద్యాల-ఎర్రగుంట్ల మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2రైళ్లు డోన్‌లో ఆగవని తెలిపారు.
News November 30, 2024
విజయవాడ: ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. నిరాకరించడంతో సూసైడ్
ఇన్స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదంగా మారిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు కాలువలో దూకిన యువతి కోసం గవర్నర్‌పేట పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా సీఐ అడపా నాగమురళి మాట్లాడుతూ.. యువతి మృతదేహాన్ని శుక్రవారం రామవరప్పాడులో ఏలూరు కాలువకట్ట వద్ద గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
News November 30, 2024
ఎన్టీఆర్ జిల్లాలో 4,600 మందికి ఉపాధి కల్పించాం: బీజేపీ
కేంద్ర పథకమైన జన శిక్షణ సంస్థాన్(JSS) కింద ఎన్టీఆర్ జిల్లాలోని 4,600 మంది మహిళలకు ఉపాధి కల్పించామని ఏపీ బీజేపీ తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుస్తుల కుట్టుపని తదితర కార్యకలాపాలలో మహిళలకు ఉపాధి కల్పించాలని బీజేపీ తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.